ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పాకాల సరస్సు ఒకటి. జిల్లాల పునర్విభజన తర్వాత ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి వెళ్ళింది. క్రీశ 1213లో చేపట్టిన మానవ నిర్మిత సరస్సు ఇది. చుట్టూ దట్టమైన అడవి, కొండ కోనల మధ్య ఉండటంతో ఈ సరస్సుకు పర్యాటక శోభ వచ్చింది. ఇది 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ సరస్సు ప్రకృతి ప్రేమికులకు ఎంతో నచ్చే ప్రదేశంగా ఉంది.ఈ సరస్సుకు ఆనుకుని ఉండే పాకాల వన్యమృగ అభయారణ్యం అరుదైన కొన్ని జంతు వృక్ష జాతులకు నిలయంగా ఉంది. పర్యాటకులు..ప్రకృతి ప్రేమికులకు పాకాల సరస్సు ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది.
(హైదరాబాద్ నుంచి 144 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ నుంచి పాకాల సరస్సు 57 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది)
సందర్శనకు అనువైన సమయం జూన్ నుంచి నవంబర్ వరకూ.ఇక్కడ ఎలాంటి వసతి సౌకర్యం అందుబాటులో లేదు. వరంగల్ నుంచి వెళ్ళి చూడాల్సి ఉంటుంది.