కృష్ఞా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో హనుమంతుడి ఎత్తైన విగ్రహం ఉంది. విజయవాడ- –హైదరాబాద్ జాతీయ రహదారిలో విజయవాడకు 28 కి.మీ దూరంలో ఈ పరిటాల గ్రామం ఉంది. ఈ ఆలయంలో 135 అడుగుల ఎత్తైన స్వామి వారి విగ్రహం నెలకొల్పారు.. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహంగా చెబుతారు. యాత్రికులు, భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మికత పెంచుతోంది ఈ ఆలయం.
కుడి చేతిలో అభయ ముద్ర, ఎడమ చేతిలో గదతో.. ‘మీకు నేనున్నాను’ అనే అభయముద్ర ఇస్తూ, ఆశ్రిత జన రక్షకుడిగా వెలసిన ఈ ఆంజనేయుడు భక్తజన మందారుడై పూజలను అందుకుంటున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే రేణుకా దేవి, సీతా లక్ష్మణ హనుమాన్ సమేత రామచంద్రునికి ఉప ఆలయాలున్నాయి.ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంగణంలో మలయ స్వామి వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. ఈ విగ్రహాన్ని చూడాలంటే తలను పూర్తిగా వెనక్కు వంచాల్సిందే.