నాగర్ కర్నూలు జిల్లాలోని ఈ దేవస్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.పలు శివలింగాలతో నిక్షిప్తమై ఉన్న 15 దేవాలయాల సమూహమే ఈ ప్రాంతం. శివరాత్రి, కార్తీక పౌర్ణమి సమయంలో ఇక్కడకు భారీ ఎత్తున భక్తులు వస్తారు. 12 సంవత్సరాలకు ఒక సారి వచ్చే కృష్ణా పుష్కరాల సమయంలో పుష్కర స్నానం ఇక్కడి ప్రత్యేకం. పొంగి పొరలే కృష్ణా నదీ జలాల నుంచి కాపాడటం కోసం ఈ దేవాలయాన్ని పురాతన సోమశిల గ్రామం నుంచి ఎత్తైన ప్రదేశానికి తరలించారు. ఈ దేవాలయ పరిసరాల నుంచి కృష్ణా నది వీక్షణం ఓ అద్భుత అనుభవంగా మిగులుతుంది.ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఈ ప్రాంతం ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలోకి వెళ్లింది.
సందర్శన వేళలు: ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకూ
మహబూబ్ నగర్‌లోని హరిత హోటల్ ఇక్కడికి వచ్చే భక్తులకు అందుబాటులో ఉన్న బస సౌకర్యం