సూర్యలంక తీరం సముద్ర స్నానానికి ఎంతో అనువైనది. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నవిగా వస్తుంటాయి. నవంబరు నెలలో తీరం వెంట డాల్ఫిన్లను కూడా చూడవచ్చు. సూర్యలంక బీచ్ వారాంతాల్లోనూ, పండగ రోజుల్లోనూ, ఇతర సెలవు రోజుల్లోనూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్నిరోజులు గడిపేందుకు వీలుగా ప్రభుత్వ వసతి గృహం, కాటేజీలు ఉన్నాయి. ఇక్కడే ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ) అతిథి గృహం కూడా ఉంది. అందులో ఓ ప్రైవేటు బీచ్ కూడా ఉంది. అందులో విదేశాలను తలపించే సౌక ర్యాలు ఉన్నాయి. సూర్యలంక వద్ద నున్న బీచ్ సముద్ర స్నానాలకు అనుకూలంగా ఉండి, పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది.
ఏసీ డిలక్స్ బీచ్ 3422రూ., ఏసీ స్టాండర్డ్2464 రూ., నాన్ ఏసీ 1680 రూ.