ప్రకాశం జిల్లాలోని అత్యంత సుందర తీరం వాడరేవు బీచ్. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన ఒంపుతో ఈ ప్రాంతం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మిగిలిన బీచ్ ల తరహాలో కాకుండా ఇక్కడ కొంత లోతు వరకూ హాయిగా వెళ్లొచ్చని ఎలాంటి ఇబ్బంది ఉండదని స్థానికులు చెబుతారు. అలలు కూడా ఇక్కడ పర్యాటకులకు అహ్లాదకర వాతావరణాన్ని అందిస్తాయి. ఈ అలలు సముద్ర స్నానం చేసే పర్యాటకులకు మంచి అనుభూతిని మిగుల్చుతాయి. ఇక్కడి లైట్ హౌస్ కూడా ఉంది.