అరకు వ్యాలీ. ఏపీలో ఓ అద్భుతమైన ప్రకృతి సృష్టించిన సుందర ప్రదేశం. అనంతగిరి, అరకు వ్యాలీలు పర్యాటకులు మదిదోచే కొండ ప్రాంతాలు. పచ్చటి దుప్పటి పరుచు కున్నట్లు ఉండే ఈ ప్రాంతం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అరకులో 19 రకాల స్థానిక గిరిజన తెగల వారు నివసిస్తారు.వీరు చేసే థింసా నృత్యం ఎంతో ప్రత్యేకం. ఇక్కడి గిరిజనుల సంస్కృతి.. అలవాట్లు ఎంతో భిన్నంగా ఉంటాయి.అరకు లోయ సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖపట్నానికి 115 కి.మీ.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణంతో, కొండలతో, లోయలతో ప్రజలను ఆకర్షిస్తోంది. సహజ సాందర్యం కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపం కలిగి సజీవంగా నిలుస్తుంది. అరకు వెళ్ళే ఇరువైపులా ఘాట్‌ రోడ్డుకు ఇరువైపులా దట్టమైన అడవులతో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అరకు అందాలు చూడాలంటే వెళ్లేటప్పుడు రైలు వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది. వైజాగ్‌లో ఉదయం కిరండోల్ వెళ్లే ప్యాసింజర్ ఎక్కాలి (ఉదయం సుమారు 6:50). అది కొండలు, లోయలు, గుహలు దాటుకుంటూ సాగిపోతుంది.ప్రయాణం సుమారు 5 గంటలు వుంటుంది. ఆ అనుభూతి అనుభవించాలే గాని చెప్పలేము. ప్రయాణంలో”సిమిలిగుడ” అనే స్టేషను వస్తుంది. అది భారతదేశంలో అతి ఎత్తులో వున్న బ్రాడ్ గేజ్ స్టేషను. శీతాకాలం అయితే వలిసపూలు పూసి కొండలన్నీ పసుపు వర్ణంతో అందంగా తయారవుతాయి. అవి చూడాలంటే అప్పుడే వెళ్ళాలి. ఇక వర్షాకాలం అయితే పచ్చదనంతో కళకళలాడుతుంది.

అరకు హరితవ్యాలీ రిసార్ట్‌ ఫోన్‌: 08936 249202

కైలాసగిరి

Previous article

బొర్రా గుహలు

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *