భవానీ ద్వీపం
కృష్ణా నదిలో సహజసిద్ధంగా ఏర్పడిన ప్రాంతమే ఈ భవానీ ద్వీపం. ఈ ద్వీపం కృష్ణానదిపై ఉన్న అన్ని ద్వీపాలలోకి పెద్దదని చెప్పాలి. ఇది విజయవాడ నగరానికి 4కి.మీ.ల దూరంలో ఉంటుంది. 133 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ దీవిని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ గొప్ప పర్యాటక ప్రదేశంగా మలిచింది. కృష్ణా నది మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఈ ద్వీపం ఉండటంతో నగర ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.
ఇక్కడ ఓ రిసార్టు కూడా ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఇది చక్కటి విహార క్షేత్రం.ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ ద్వీపంలో రాత్రి బస చేసేందుకు వీలుగా ట్రీ టాప్ కాటేజీలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి భయం లేకుండా ఉండేందుకు భద్రతా సిబ్బందిని నియమించారు. ద్వీపంలో పిల్లలు..పెద్దలు ఎంజాయ్ చేసేందుకు అనువైన వాతావరణం ఉంటుంది.