కోవిడ్ దెబ్బ...బిజినెస్ క్లాస్ సీట్లకు పెరుగుతున్న డిమాండ్!

కోవిడ్ దెబ్బ...బిజినెస్ క్లాస్ సీట్లకు పెరుగుతున్న డిమాండ్!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా భయం రాజ్యమేలుతున్న విషయం తెలిసిందే. ఎక్కడకు ప్రయాణం చేయాలన్నా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని కానీ బయటకు రావటం లేదు. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఇవి సాధారణ స్థితికి రావటానికి కనీసం రెండేళ్ళకుపైనే పడుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో కోవిడ్ రిస్క్ తగ్గించుకునేందుకు పలు దేశాల్లో ప్రయాణికులు బిజినెస్ క్లాస్ టిక్కెట్ల మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్రధాన ఎయిర్ లైన్స్ లో ఈ టిక్కెట్లు ఉన్న వారి ఎంట్రీ, ఎగ్జిట్ రూట్లు కూడా సపరేట్ గా ఉంటాయి. అంతే కాదు..విమానంలో ఉన్న 300 మంది ప్రయాణికులతో కాకుండా..కేవలం పరిమిత సంఖ్యలో ఉండే బిజినెస్ క్లాస్ సీట్లలో ఉన్న ప్రయాణికులతో మాత్రమే కాంటాక్ట్ ద్వారా గమ్యానికి చేరుకోవచ్చు.

అందుకే చాలా మంది ఖరీదైన వ్యవహారం అయినా కూడా బిజినెస్ క్లాస్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గతంలో అయితే బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు విమానాశ్రయంలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి రాజభోగాలు కల్పించేవి ఎయిర్ లైన్స్. అయితే ఇప్పుడు ఆ సౌకర్యాల్లో చాలా వరకూ కోత పడిందని..ప్రయాణికులు కూడా సౌకర్యాల కంటే సురక్షితం అనే అంశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. అందుకే సౌకర్యాల్లో కోత పడినా కూడా ముందు కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటే చాలు అన్న అందంగా చాలా మంది ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it