సింగపూర్ విమానాశ్రం..పదేళ్ళలో తొలిసారి!
ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది సింగపూర్ లోని చాంగీ విమానాశ్రయం. స్కైట్రాక్స్ నుంచి వరసగా ఎనిమిదేళ్లు ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయం ర్యాంక్ పొందింది. అలాంటి సింగపూర్ విమానాశ్రయంలో గత పదేళ్లలో తొలిసారి ట్రాఫిక్ తగ్గుముఖం పట్టింది. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనాతో పోరాటం ఇప్పుడే మొదలైందని..రాబోయే రోజుల్లో ట్రాఫిక్ పెరగటం కష్టమైన వ్యవహారమే అని చాంగీ విమానాశ్రయం పేర్కొంది. సుధీర్ఘకాలం కొనసాగుతున్న ఈ మహమ్మారి వల్ల విమానయాన రంగంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని పేర్కొన్నారు. నిర్వహణ వ్యయాలు తగ్గించుకునేందుకు చాంగీ విమానాశ్రయంలో రెండు టెర్మినల్స్ ను మూసివేశారు.
సింగపూర్ విమానాశ్రయం చరిత్రలో ఎన్నడూలేని రీతిలో విమానాల రాక తగ్గిపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 26 వేల విమానాలు పార్కు చేసి ఉన్నాయి. చాంగీ విమానాశ్రయం 2019లో 15 లక్షల చదరపు అడుగుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జ్యువెల్ ను ఓపెన్ చేసింది. ఇందులోని షాపింగ్, ఎంటర్ టైన్ మెంట్ కాంప్లెక్స్ ప్రయాణికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి త్వరలో అందుబాటులోకి వచ్చే చికిత్సలు...వివిధ దేశాలు తమ సరిహద్దులను ఎంత మేరకు తెరుస్తాయి అనే అంశాల ఆధారంగానే రవాణా రంగ రికవరి ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
- Changi airport Closed two terminals First time in decade Singapore Skytrax report Traffic fall Worlds best airport చాంగీ విమానాశ్రయం ట్రాఫిక్ తగ్గుముఖం పదేళ్ళలో తొలిసారి సింగపూర్ Changi airport Closed two terminals First time in decade Singapore Skytrax report Traffic fall Worlds best airport చాంగీ విమానాశ్రయం ట్రాఫిక్ తగ్గుముఖం పదేళ్ళలో తొలిసారి సింగపూర్