దేశీయ విమానాల సంఖ్య మరింత పెంపు

దేశీయ విమానాల సంఖ్య మరింత పెంపు

అన్ లాక్ 4లో కేంద్రం మరిన్ని సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై సెప్టెంబర్ 30 వరకూ ఆంక్షలు విధించారు. అదే సమయంలో దేశీయ విమానాల సంఖ్యను పెంచుకునేందుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా కంటే ముందు తిరిగిన సర్వీసుల్లో 45 శాతం మేర విమానాలు నడపటానికి మాత్రమే అనుమతించారు. ఇప్పుడు ఈ పరిమితిని 60 శాతానికి పెంచారు.

ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ జూన్ 26న ఇచ్చిన ఆదేశాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం వెలువరించింది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించటంతోపాటు ప్రయాణికుల నుంచి ఉన్న డిమాండ్ ల పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించిన నాటి నుంచి కూడా విమానాల్లో ఆక్యుపెన్సీ రేషియో 50 నుంచి 60 శాతం మధ్యలోనే ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it