దుబాయ్ లో పర్యాటకుల సందడి మొదలు

దుబాయ్ లో పర్యాటకుల సందడి మొదలు

దుబాయ్. ఏటా నిత్యం కోట్లాది మంది సందర్శించే దేశం. దుబాయ్ ఆర్ధిక వ్యవస్థలో పర్యాటక రంగం వాటా చాలా కీలకం. కరోనా దెబ్బకు ఆ దేశం కూడా అందరిలాగే సరిహద్దులు మూసేసింది. కానీ అందరి కంటే ముందుగా అంటే జులై 7 విదేశీ పర్యాటకులను అనుమతించటం ప్రారంభించింది. దీంతో దుబాయ్ లో పర్యాటకుల సందడి ప్రారంభం అయింది. అయితే ప్రస్తుతం దుబాయ్ లో పర్యటించాలనుకునేవారు కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదంటే అక్కడ పరీక్ష నిర్వహిస్తారు. ఫలితం పాజిటివ్ వస్తే ప్రయాణికుడి సొంత ఖర్చుతో పధ్నాలుగు రోజులు అక్కడ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటు దుబాయ్ చెల్లుబాటు అయ్యే ఆరోగ్య భీమా కూడా అడుగుతోంది. గత ఏడాది దుబాయ్ ను 16.7 మిలియన్ల మంది సందదర్శించారు.

ఈ ఏడాది ఆ టార్గెట్ 20 మిలియన్లుగా పెట్టుకున్నారు. కానీ కోవిడ్ 19 దెబ్బకొట్టింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పర్యాటకులను ఆహ్వానించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దుబాయ్ అధికార వర్గాలు చెబుతున్నాయి. దుబాయ్ పర్యాటకులకు మార్గం సుగమం చేసినా భారత్ నుంచి ప్రస్తుతం దుబాయ్ తోపాటు ఏ విదేశీ పర్యటన చేసేందుకు వీలుగా విమానాలు లేవు. అయితే సర్కారు ప్రస్తుతం పలు కీలక దేశాలతో చర్చిస్తోంది. ఈ చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాత త్వరలోనే దుబాయ్ తోపాటు పలు దేశాలకు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు.

https://www.youtube.com/watch?v=Q-c3dtvyQ18

Similar Posts

Recent Posts

International

Share it