ఆ ద్వీపం ఓపెన్...కరోనా పేషంట్లకు మాత్రమే

ఆ ద్వీపం ఓపెన్...కరోనా పేషంట్లకు మాత్రమే

పర్యాటకులు ఎవరైనా తమ దేశం రావాలంటే కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ ఉండాలని చెబుతున్నాయి పలు దేశాలు. అంతే కాదు..48గంటల ముందు పరీక్ష చేయించుకోవాలని..ఈ రిపోర్ట్ తోనే అడుగుపెట్టాలని షరతులు పెడుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. బ్రెజిల్ లోని ఓ దీవిని పర్యాటకుల కోసం ఓపెన్ చేశారు. అక్కడ మాత్రం కేవలం కోవిడ్ 19 పాజిటివ్ పేషంట్లను మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఫెర్నాండో డీ నోరాన్హా దీవిలో ఇప్పుడు పాజిటివ్ పేషంట్లను అనుమతించనున్నారు. అందులోకి ప్రవేశించాలనుకునేవారు పాజిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.

దీనికి గాను పర్యాటకులు పర్యావరణ పరిరక్షణ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడకు వచ్చేవారందరికీ ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఇచ్చి దాన్ని చేతికి కట్టుకోవాల్సిందిగా కోరతారు. అధికారులు అంతా ఓకే అని చెప్పేవరకూ వారు ఆ ఐడీని ధరించాల్సి ఉంటుంది. కరోనాతో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఐదు నెలల అనంతరం ఈ దీవిని ఓపెన్ చేస్తున్నారు. ఫెర్నాండో నోరోన్హా బ్రెజిల్ లో ఎంతో పాపులర్ బీచ్. గత ఏడాది కేవలం బ్రెజిల్ కు చెందిన వారే లక్షా ఆరు వేల మంది సందర్శించారు.

Similar Posts

Recent Posts

International

Share it