గోవా..భారత్ బీచ్ ల రాజధాని

గోవా..భారత్  బీచ్ ల రాజధాని

గోవా..ఈ పేరు చెపితే వెంటనే గుర్తొచ్చేది బీచ్ లే. ఒక్క మాటలే చెప్పాలంటే గోవా...భారత్ లో ఉన్న బీచ్ ల రాజధాని అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో అక్కడ ఉన్నన్ని బీచ్ లు దేశంలోమరెక్కడా లేవు. అంతే కాదు..గోవాలో ఒక్కో బీచ్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా లక్షలాది మంది గోవాను దేశ, విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు. గోవాలో నైట్ లైఫ్ కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ బీచ్ ల్లో వాటర్ స్పోర్ట్స్, మసాజ్ సెంటర్లు, డిస్కో క్లబ్స్ వంటి ఎన్నో ఆకర్షణలు గోవా సొంతం. అంతే కాదు....దేశంలోనే క్యాసినో లు ఉన్న ఏకైక ప్రాంతం గోవా మాత్రమే.

ఈ క్యాసినోలు అన్నీ కూడా నీళ్ల మధ్యలో ఉండటంతో పర్యాటకలను ఇవి విశేషంగా ఆకట్టుకుంటాయి. విదేశీ పర్యాటకులు ఎక్కువ మంది ఉండే బీచ్ ల్లో ముఖ్యమైనవి అరంబోల్ బీచ్, కోలవా బీచ్, అశ్వమ్ బీచ్, ఓజ్రాన్ బీచ్, వెగాటర్ బీచ్,బెనాలియం, బీచ్, అంజునా బీచ్ వంటివి ఉన్నాయి. గోవాలో అత్యధిక మంది పర్యాటకులు సందర్శించే ప్రధాన బీచ్ ల వివరాలు ‘ట్రావెలోకం.కామ్’ పాఠకుల కోసం..

1.బాగా బీచ్: గోవాలోని పాపులర్ బీచ్ ల్లో బాగా బీచ్ ఒకటి. ప్రకృతిలోని సుందర దృశ్యాలను ఇక్కడ వీక్షించవచ్చు. ఈ బీచ్ చుట్టుపక్కల పర్యాటకులు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉంటాయి. గోవాలో అత్యంత రద్దీ ఉండే బీచ్ ల్లో ఇది ముఖ్యమైనది. ఈ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ కూ అనుమతి ఉంది. ఇది ఉత్తర గోవాలో ఉంటుంది. బాగా క్రీక్ కారణంగా దీనికి బాగా బీచ్ అనే పేరు వచ్చింది.

https://www.youtube.com/watch?v=bpdiQBr8eDA

2.కాలంగూట్ బీచ్: పర్యాటకులను ఎక్కువ ఆకర్షించే ప్రాంతాల్లో ఇది ఒకటి. నిత్యం రద్దీగా ఉండే వాటిల్లో ఇది కూడా ఒకటి. ఎంతో పాపులర్ బీచ్ అయిన కాలంగూట్ లో పారా సెయిలింగ్ తోపాటు వాటర్ స్పోర్ట్స్ చాలా అందుబాటులో ఉంటాయి ఇక్కడ. ఇది కూడా ఉత్తర గోవాలోనే ఉంటుంది. ఈ బీచ్ ను పర్యాటకలు సందర్శించే పీక్ సీజన్ అంటే క్రిస్మస్, నూతన సంవత్సర సమయమే. వేసవిలోనూ పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తారు. ఇక్కడ సముద్రం చాలా రఫ్ గా ఉంటుంది. అందుకే ఇక్కడ ఈత (స్విమ్మింగ్) అనుమతించరు.

https://www.youtube.com/watch?v=3-uX2Q-n8E8

3.పాలోలెమ్ బీచ్: దక్షిణ గోవాలో ఉన్న సుందరమైన బీచ్ ల్లో ఇది ఒకటి. ఇతర పాపులర్ బీచ్ లతో పోలిస్తే ఇక్కడ కాస్త రష్ తక్కువగా ఉంటుంది. ఇక్కఅడ నీటిలో అలజడి తక్కువ. పార్టీ ప్రియులకు ఇది ఎంతో అనుకూలమైన ప్రాంతం. బీచ్ కు అనుకుని ఉండే తాటి చెట్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇది కూడా దక్షిణ గోవాలోనే ఉంటుంది. ఇక్కడ బీచ్ వ్యూ పర్యాటకలను విశేషంగా ఆకట్టుకుంటుంది.

4.అంజునా బీచ్: అంజునా..ఇది ఓ గ్రామం పేరు. అక్కడ ఉన్న బీచ్ కావటంతో దీనికి అంజునా బీచ్ అనే వచ్చింది. ఉత్తర గోవాలో ఉంటుంది ఈ బీచ్. దేశీయ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకులు ఇక్కడ మార్కెట్ ను సందర్శిస్తారు. ఇక్కడ ఉన్న చాపోరా ఫోర్ట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ బీచ్ నుంచి సూర్యాస్తమయాన్ని చూడటం ఓ ప్రత్యేక అనుభూతిని మిగుల్చుతుంది.

5.వెగాటోర్ బీచ్: గోవాలోని ప్రముఖ బీచ్ ల్లో ఇది ఒకటి. ఈ బీచ్ లో నీరు ఎంతో స్వచ్చంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ఎరుపు శిఖరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా దేశీయ పర్యాటకులే సందర్శిస్తారు. పర్యాటక సీజన్ లో ఇక్కడ డ్యాన్స్ లు, ఎక్కువ మంది పర్యాటకులు కలసి చేసుకునే పార్టీలకు అనువైన ప్రదేశం.

6.కండోలమ్ బీచ్: గోవాలోని పాపులర్ బీచ్ ల్లో ఇది ఒకటి. కాలంగూట్ బీచ్ కు సమీపంలోనే ఇది కూడా ఉంటుంది. గోవాలోని అతి పెద్ద బీచ్ ల్లో ఇది ఒకటి. వాటర్ స్పోర్ట్స్ తోపాటు వాణిజ్య కార్యకలాపాలకు అనువైన ప్రదేశం ఇది.

https://www.youtube.com/watch?v=TEnAzWw09mU

Similar Posts

Recent Posts

International

Share it