అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం అక్టోబర్ 31 వరకూ
భారత్ మరోసారి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగించింది. అక్టోబర్ 31 వరకూ ఇది అమల్లో ఉండనుంది. అన్ లాక్5.0లో భాగంగా కేంద్రం బుధవారం నాడు పలు మినహాయింపులు ఇచ్చింది. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులపై మాత్రం ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ విడిగా ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ కార్గో విమానాలు, డీజీసీఏ ఆమోదించిన విమాన సర్వీసులకు ఇది వర్తించదు.
ఇప్పటికే ఎయిర్ బబుల్ కింద ఒప్పందం చేసుకున్న దేశాలకు ఎంపిక చేసిన మార్గాల్లో నడిచే విమాన సర్వీసులకు నిషేధం వర్తించదు. భారత్ కొత్తగా కెన్యాతోపాటు భూటాన్ తదితర దేశాలతో కూడా ఎయిర్ బబుల్ ఒప్పందాలు చేసుకుంది. మరికొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు చర్చలు సాగుతున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.
- covid 19 India travel restrictions International flights International Flights ban Travek restrictions Upto october31st Visa restrictions అక్టోబర్ 31 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు నిషేధం covid 19 India travel restrictions International flights International Flights ban Travek restrictions Upto october31st Visa restrictions అక్టోబర్ 31 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు నిషేధం