కడెం డ్యామ్
ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన వాతావరణంలో చుట్టూ పచ్చదనంతో నిండిఉన్న సుందరమైన గుట్టల మధ్యలో ఈ డ్యాం నిర్మించారు. సికింద్రాబాద్-–మన్మాడ్ రైల్వే లైన్ మీదుగా వెళ్లే పర్యాటకులకు కడెం డ్యామ్ అందుబాటులో ఉంటుంది. ఇది గోదావరి ఉపనది. డ్యామ్ ప్రధాన లక్ష్యం ఆదిలాబాద్ జిల్లాలోని 25000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరందించడమే. అయినా పర్యాటక ప్రాంతంగా కూడా ఈ డ్యాం పేరు దక్కించుకుంది.చారిత్రక ఆధారాల ప్రకారం మొదట ఈ ప్రాంతాన్ని యాగాలు చేసిన కండవ రుషి పేరుతో పిలిచేవారు.
ఆ తరువాత, ఈ ప్రాంత ప్రముఖ నాయకుడు కదం నారాయణ రెడ్డికి నివాళిగా కదం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్(KNRP)గా ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేసింది. డ్యాం పక్కన పర్యాటకులకోసం అందమైన గార్డెన్ ఉంది. వర్షాకాల సమయంలో వచ్చే వరదలకు డ్యాం గేట్లనుండి నీటిని వదులుతారు. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్లే దారిలో నిర్మల్ వద్ద ఈ డ్యామ్ ఉంది. ఈ డ్యాంకు ఆదిలాబాద్ సమీప రైల్వేస్టేషన్.