‘వాటర్ ట్యాక్సీ’లను ప్రవేశపెడుతున్నకేరళ

‘వాటర్ ట్యాక్సీ’లను ప్రవేశపెడుతున్నకేరళ

కేరళ పర్యాటకుల కోసం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. అక్టోబర్ నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. అలప్పుజ బ్యాక్ వాటర్స్ లో వాటర్ ట్యాక్సీలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. రోడ్లపై నడిచే ట్యాక్సీలు ఎలాగో...ఈ వాటర్ ట్యాక్సీలు కూడా అలాగే. పర్యాటకులు కోరిన చోటకు తీసుకెళ్లి వాళ్లను డ్రాప్ చేసి వస్తారు ఇందులో. ఈ వాటర్ ట్యాక్సీలో పది సీట్లు ఉంటాయి. గత ఏడాదే కేరళకు చెందిన స్టేట్ వాటర్ ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ (ఎస్ డబ్ల్యూటీడీ) ప్రయోగాత్మకంగా నడిపి చూసిన తర్వాతే ఈ వాటర్ ట్యాక్సీలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

ఈ ట్యాక్సీ ఛార్జీలను గంటల లెక్కన వసూలు చేస్తారని..ఇవి పర్యాటకులకు అందుబాటులోనే ఉంటాయని ఎస్ డబ్ల్యూటీడీ డైరక్టర్ షాజీ వి నాయర్ వెల్లడించారు. గంటకు పదిహేను నాటికల్ మైల్స్ స్పీడ్ తో ఇది ప్రయాణిస్తుంది. ఒక నిర్దేశిత ప్రాంతానికి కాకుండా..బోట్ స్టేషన్ నుంచి పర్యాటకులు కోరుకున్న చోటకు వీటిలో ప్రయాణించవచ్చని తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో పర్యాటక పరంగా ఎంతో కీలకమైన అలప్పుజ బ్యాక్ వాటర్స్ లో నాలుగు వ్యాటర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టనున్నారు. కొచ్చికి చెందిన నవగతి అనే సంస్థ ఈ వాటర్ ట్యాక్సీలను తయారు చేస్తోంది.

Similar Posts

Recent Posts

International

Share it