కిన్నెరసాని అభయారణ్యం
కిన్నెరసానిలో విద్యుత్ ప్రాజెక్టు కోసం నిర్మించిన డ్యామ్..రిజర్వాయర్ లే ప్రత్యేక ఆకర్షణ. 634 చదరపు కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న అరణ్యంలో కిన్నెరసాని ప్రాజెక్టు ఉంది. ఈ రిజర్వాయర్ మొసళ్లకు ప్రసిద్ధి. పర్యాటక శాఖ ఇక్కడ అద్దాల మేడ, కెఫెటేరియా వంటి సౌకర్యాలు కల్పించింది.కిన్నెరసాని గోదావరి ఉపనది. కిన్నెరసాని జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడారం - తాడ్వాయి కొండ సానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి భద్రాచలానికి కాస్త దిగువన బూర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్యన గోదావరిలో కలుస్తుంది.
అక్టోబర్-–మే ఈ ప్రాంతం సందర్శనకు అనువైన సమయం. భద్రాచలం నుంచి
35 కిలోమీటర్ల దూరంలో.. కొత్తగూడెం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.