లంబసింగి

లంబసింగి

వైజాగ్ జిల్లాలోని ఈ ప్రాంతానికి ఆంధ్రా కాశ్మీర్ అనే పేరు ఉంది. చింతపల్లి మండలంలోని ఓ చిన్న గ్రామం అయిన ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే లంబసింగి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. లంబసింగిలో ఉష్ణోగ్రతలు ప్రతి ఏటా డిసెంబర్-–జనవరి కాలంలో 2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. ఒక్కోసారి జీరో డిగ్రీలకూ పడిపోతుంది ఉష్ణోగ్రత. దక్షిత భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంతంలో మంచు వర్షం కురుస్తుంది. సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉన్న లంబసింగి ఒక గిరిజన గ్రామం. ఇక్కడి ఉష్ణోగ్రతల కారణంగానే ఆంధ్రా కాశ్మీర్, ఆంధ్రా ఊటీ అనే పేర్లొచ్చాయి ఈ ప్రాంతానికి.శీతాకాలం మిగతా కాలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఎత్తులో ఉన్న లంబసింగి చేరుకొనేటప్పుడు చల్లని వాతావరణం, మంచుతెరలు, కాశ్మీరాన్ని తలపించే లోయలు పర్యాటకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. మన్యం ఏరియాలో ఉంది కనుక కొండలు, అడవులు దాటుకొని వెళ్ళవలసి వస్తుంది. ఇరువైపులా లోయలు... మధ్యలో రోడ్డు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో కాఫీ తోటల పెంపకం బ్రిటీష్ కాలం నుంచే ఉంది.

వైజాగ్‌కు 101 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Similar Posts

Recent Posts

International

Share it