హైదరాబాద్-చికాగో నాన్ స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్-చికాగో నాన్ స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఇక అమెరికా వెళ్ళాలంటే కనెక్టింగ్ ఫ్లైట్ల కోసం ఢిల్లీ, చెన్నయ్ వంటి నగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ నుంచి నేరుగా చికాకో వెళ్ళేందుకు వీలుగా విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. జనవరి 15 తెల్లవారు జామున 01.00 గంటలకు ఎయిర్ ఇండియా - AI-108 నాన్-స్టాప్ విమానం 237 ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగా, విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులను, ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బందికి ఆహ్వానం పలికారు. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777 ఎల్ఆర్- ఫ్లైట్ నెం. AI 107 శుక్రవారం నాడు సుమారు 12.50 గంటలకు హైదరాబాద్ నుండి చికాగోకు 226 ప్రయాణీకులు, 16 మంది సిబ్బందితో చికాగోకు బయలుదేరి వెళ్లింది. AI-107 విమానం వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుండి చికాగోకు వెళుతుంది.

హైదరాబాద్ నుండి 1250 గంటలకు (IST) బయలుదేరే ఈ విమానం, అదే రోజు 1805 గంటలకు (CST / Local US సమయం) చికాగో చేరుకుంటుంది. చికాగో నుండి హైదరాబాద్ వెళ్లే బోయింగ్ 777LR రిటర్న్ ఫ్లైట్ AI-108 ప్రతి బుధవారం చికాగో నుండి 21.30 గంటలకు (CST / Local US సమయం) బయలుదేరి 01.40 గంటలకు (IST) హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి చికాగో మధ్య 13,293 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 16 గంటల 45 నిమిషాలలో, చికాగో, హైదరాబాద్‌ల మధ్య దూరాన్ని ప్రయాణించానికి 15 గంటల 40 నిమిషాలు పడుతుంది. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ "చికాగో, హైదరాబాద్‌ను కలిపే ఈ కొత్త కనెక్షన్ కొంతకాలంగా కనెక్టివిటీ కావాలని కోరుతున్న జాబితాలో ఉంది.

ఈ సర్వీసును మన సొంత జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియా ప్రారంభించడం ఎంతో సంతోషకరం. ఈ కనెక్షన్ ప్రారంభించటం వల్ల హైదరాబాద్ నుండి అమెరికాకు సరాసరి విమానాల కోసం ఎదురుచూస్తున్న రెండు గమ్యస్థానాల ప్రయాణీకులకూ ఆనందదాయకం. ప్రయాణీకుల డిమాండ్లను తీర్చడానికి, గమ్యస్థానాలను కనెక్ట్ చేయడానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రమాణాల భద్రతపై దృష్టి సారించి, ప్రయాణీకులకు సేవ చేయడానికి, మరిన్ని దేశీయ, అంతర్జాతీయ నగరాలను కనెక్ట్ చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. " అన్నారు.

Similar Posts

Recent Posts

International

Share it