'ఉత్తరాఖండ్ బెనిటాల్ లో 'ఖగోళ గ్రామం'
ఉత్తరాఖండ్ లో ఇప్పటివరకూ ఆ ప్రాంత అందాలు కలుషితం కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఇప్పటివరకూ ఎవరూ తాకని అందమైన ప్రదేశం అన్న మాట. ఇది సముద్రమట్టానికి 2500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎలాంటి రణగొణధ్వనులు లేకండా నక్షత్రాలు..ఆకాశం,చందమామను చూడాలనుకునేవారికి ఇంతకు మించిన మంచి ప్రదేశం ఉండదు. ఉత్తరాఖండ్ చమేలీ జిల్లాలోని బెనిటాల్ గ్రామంలో ఇప్పుడు పర్యాటకులు..ప్రకృతి ప్రేమికులను ఆకర్షించేలా 'ఖగోళ గ్రామం' అభివృద్ధి చేయనున్నారు. ఖగోళ పర్యాటకాన్ని ప్రోత్సహిందుకు ఇది ఎంతో అనువైన ప్రదేశంగా భావిస్తున్నారు. ఈ నెలలోనే బెనిటాల్ గ్రామంలో తొలిసారి ఖగోళ పార్టీ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఆకాశంలో జరిగే పలు అద్బుతాలను చూసే అవకాశం కల్పించారు. బెనిటాల్ లో అతి తక్కువ కాలుష్యం ఉండటం కూడా ఖగోళ గ్రామం ఏర్పాటుకు అనుకూల ప్రాంతంగా గుర్తించారు. రాత్రివేళల్లో ఇక్కడ నుంచి ఆకాశాన్ని చూడటానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోవటం కలిసొచ్చే అంశంగా ఉంది.
ఆకాశంలో జరిగే అద్భతాలను వీక్షించాలనుకునేవారికి ఇది అత్యుత్తమ ప్రాంతంగా నిలుస్తుంది. బెనిటాల్ లో ఉండే సుందర ప్రదేశాలు..రాత్రివేళ ప్రకాశించే ఆకాశాన్ని చూడటానికి ఇది ఎంతో బాగుంటుందని స్టార్ స్కేప్స్ పౌండర్ వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో పేర్కొంది. ఈ సంస్థే ఇక్కడ రకరకాల కార్యకలాపాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. పగటి సమయంలో ఇక్కడ పర్యాటకులు హైకింగ్, సైక్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేయవచ్చన్నారు. రాత్రివేళలు మాత్రం ఈ ప్రాంతాన్ని ఖగోళ పార్టీలకు మాత్రం పరిమితం చేస్తారు. ఇక్కడ నుంచి చందమామ, నక్షత్రాల వీక్షణకు అవకాశం కల్పిస్తారు. పర్యాటకులు ఇలాంటి కొత్త కాన్సెప్ట్ లను ఎంజాయ్ చేయటానికి ఎంతో ఆసక్తిచూపుతారని..అందుకే అస్ట్రో విలేజ్ కార్యక్రమం విజయవంతం అవుతుందని భావిస్తున్నారు..