భారత విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం
ప్రపంచంలోనే పలు దేశాలతో భారత్ సంబంధాలు కట్ అవుతున్నాయి. దీంతో ఆయా దేశాల మధ్య రాకపోకలు సాగించటం గగనం కానుంది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా పలు దేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలను నిషేధిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఆ జాబితాలో చేరింది. దేశంలోకి మరిన్ని కరోనా వైరస్ కేసులను దిగుమతి చేసుకోవటానికి చెక్ పెట్టేందుకు భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నిషేధం మే 15 వరకూ అమల్లో ఉండనుంది. తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇఫ్పటికే యుఏఈ, యూకె, హాంకాంగ్, మాల్దీవులతో సహా పలు దేశాలు భారత విమానాలను నిషేధం విధించాయి. ఈ కేసుల ఉధృతి తగ్గకపోతే మిగిలిన దేశాలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
- Australia Bans All Flights From India To Avoid New covid 19 cases Flights Ban Upto May 15th Latest travel news ఆస్ట్రేలియా భారత్ విమానాలు నిషేధం మే 15 వరకూ కరోనా కారణంగానే Australia Bans All Flights From India To Avoid New covid 19 cases Flights Ban Upto May 15th Latest travel news ఆస్ట్రేలియా భారత్ విమానాలు నిషేధం మే 15 వరకూ కరోనా కారణంగానే