విమాన ప్రయాణికులు 3.28 కోట్లు దాటేశారు
దేశీయ విమానయాన రంగం కోవిడ్ ముందు నాటికి పరిస్థితికి వస్తోంది. క్రమక్రమంగా విమాన సర్వీసులు పెరుగుతుండగా, విమాన ప్రయాణికుల సంఖ్య కూడా అదే రేంజ్ లో పెరుగుతోంది. కోవిడ్ లాక్ డౌన్ తర్వాత దేశంలో మే 25న దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించారు. అప్పటి నుంచి 2021 జనవరి 8 వరకూ దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 3, 28,66,003కు చేరింది. అదే సమయంలో విమాన సర్వీసుల సంఖ్య ఇదే కాలంలో 3,20,466గా ఉంది.
క్రమంగా కోవిడ్ ముందు నాటి స్థాయిలో విమాన ప్రయాణికుల సంఖ్య వస్తోందని ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వెల్లడించింది. త్వరలోనే కేంద్ర పౌరవిమానయాన శాఖ వంద శాతం సర్వీసులను అనుమతించే అవకాశం ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండటంతోపాటు..వచ్చే సమ్మర్ నాటికి సాధారణ పరిస్థితులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
- Domestic flight operations Passengers. Crossed 3.28 crs Since 2020 may Latest travel news దేశీయ విమానయాన ప్రయాణికులు 3.28 కోట్లు దాటేశారు 2020 మే నుంచి నిషేధం జనవరి 7 వరకూ Domestic flight operations Passengers. Crossed 3.28 crs Since 2020 may Latest travel news దేశీయ విమానయాన ప్రయాణికులు 3.28 కోట్లు దాటేశారు 2020 మే నుంచి నిషేధం జనవరి 7 వరకూ