దుబాయ్ లో ఎంట్రీకి నిబంధనలు కఠినతరం
పర్యాటకుల ఎంట్రీ విషయంలో దుబాయ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. భారత్ తోపాటు పలు దేశాల్ల కరోనా రెండవ దశ కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో ఈ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు దుబాయ్ వెళ్లే పర్యాటకులు ఎవరైనా 48 గంటలు ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తున్నారు. ఇటీవల వరకూ ఈ నిబంధన 72 గంటలుగా ఉండేది. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (డీసీఏఏ) తాజాగా ఇందులో మార్పులు చేసింది. ఏప్రిల్ 22 నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపారు.
భారత్-దుబాయ్ ల మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం ఉండటంతో ఈ రెండు దేశాల మధ్య రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే దుబాయ్ కు వెళ్లే ప్రయాణికులు ఖచ్చితంగా శాంపిల్ ఎప్పుడు ఇచ్చింది..నివేదిక ఎప్పుడు తీసుకున్నది వంటి వివరాలు కూడా అందులో ఖచ్చితంగా ప్రస్తావించాల్సి ఉంటుందని తెలిపారు. నెగిటివ్ రిపోర్టుల ఒరిజినల్స్ ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదించిన ల్యాబ్ ల్లో టెస్ట్ లను మాత్రం పరిగణనలో తీసుకుంటారు. ఎయిర్ బబుల్ ఒప్పందం ఉన్న అన్ని దేశాలకు డీసీఏఏ ఈ మేరకు సమాచారం అందజేసింది.
- Dubai Civil Aviation Authority New Rules Travellers Need 48 hrs Before Rtpcr test Report Latest trvel news దుబాయ్ పర్యాటకులపై కొత్త నిబంధనలు 48 గంటల ముందు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి Dubai Civil Aviation Authority New Rules Travellers Need 48 hrs Before Rtpcr test Report Latest trvel news దుబాయ్ పర్యాటకులపై కొత్త నిబంధనలు 48 గంటల ముందు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి