ఎమిరేట్స్ చేతికి ఒకే నెలలో రెండు ఏ 380 జంబో జెట్స్

ఎమిరేట్స్ చేతికి ఒకే నెలలో రెండు ఏ 380 జంబో జెట్స్

దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఒక్క నెలలోనే రెండు జంబో జెట్ విమానాలు అయిన ఏ 380 లను అందుకుంది. ఈ విషయాన్ని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. 117వ డబుల్ డెక్కర్ విమానం అయిన ఏ 380 తాజాగా ఎమిరేట్స్ ఫ్లీట్ లో చేరింది. అంతే కాదు..ఎప్పటి నుంచో ఎమిరేట్స్ ఎదురుచూస్తున్న సిగ్నేచర్ ప్రీమియం ఎకానమీతో కూడిన తదుపరి ఏ 380 డబుల్ డెక్కర్ ను కూడా త్వరలోనే అందుకోనున్నట్లు వెల్లడించింది. పన్నెండు సంవత్సరాల క్రితం తొలి ఏ 380 ను ఏమిరేట్స్ సేకరించింది. ఇది విమాన ప్రయాణికులకు ఎంతో ఇష్టమైన సర్వీస్.

ఎందుకంటే ఇందులో ఉండే విలాసాలు ఓ రేంజ్ లో ఉంటాయి మరి. ప్రీమియం ఛార్జీలు చెల్లించటానికి సిద్ధపడాలే కానీ..ఏ 380 అందించే సేవలు అలా ఉంటాయి. విమానంలోనే ఓపెన్ ఏరియాలో బార్ ఉంటుంది ఈ విమానాల్లో. ముఖ్యంగా దుబాయ్ నుంచి పలు కీలక అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేర్చేందుకు ఎమిరేట్స్ ఈ ఏ 380 విమాన సర్వీసులను ఉపయోగిస్తోంది. ఏ 380లో ప్రయాణం ఏ ఇతర సర్వీసులతోనూ పోల్చలేమని చెబుతారు ఈ రంగంలోని నిపుణులు. కొన్ని ఎయిర్ లైన్స్ అయితే ఏ 380 విమానాల్లో ఏకంగా ప్రయాణికులకు డబుల్ బెడ్ రూమ్ తరహాలో అపార్ట్ మెంట్ తరహాలో సేవలు కూడా అందిస్తున్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it