జనవరి 7 వరకూ యూకెకు విమానాల నిషేధం పొడిగింపు
యూకెకు విమానరాకపోకలపై నిషేధాన్ని కేంద్రం జనవరి 7 వరకూ పొడిగించింది. వాస్తవానికి ఈ నిషేధం డిసెంబర్ 31 వరకే ఉంది. అందుకే కేంద్రం తాజాగా నిషేధాన్ని జనవరి 7 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఆ తర్వాత పూర్తిగా నియంత్రిత విధానంలో విమానాలను అనుమతించటం జరుగుతుందని, దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
యూకెలో వెలుగుచూసిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కారణంగా భారత్ తోపాటు ప్రపంచంలోని పలు దేశాలు యూకెకు విమానాల రాకపోకలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ కు అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం ఉండటంతో సత్వరమే స్పందించిన ప్రభుత్వాలు ఆ మేరకు విమానాలపై నిషేధ నిర్ణయం తీసుకున్నాయి. అయినా సరే భారత్ తోపాటు పలు దేశాల్లో బ్రిటన్ స్ట్రెయిన్ కేసులు వెలగు చూస్తూనే ఉన్నాయి.
- Flights to uk Temporary suspension Upto january 7th Hardeep singh puri Latest travel news యూకెకు విమానాలు నిషేధం జనవరి 7 వరకూ పొడిగింపు హర్దీప్ సింగ్ పూరీ Flights to uk Temporary suspension Upto january 7th Hardeep singh puri Latest travel news యూకెకు విమానాలు నిషేధం జనవరి 7 వరకూ పొడిగింపు హర్దీప్ సింగ్ పూరీ