వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎక్కడైనా తిరగొచ్చు!
పర్యటనలపై అమెరికా కీలక నిర్ణయం
'మీరు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా?. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని కూడా రెండు వారాలు దాటిపోయిందా?. ఇక మీరు ఎక్కడైనా పర్యటించవచ్చు అంటోంది అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్( సీడీసీ).' ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేసింది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంటుందని సీడీసీ చెబుతోంది. ఇది అమెరికాలోని పర్యాటకులకు పెద్ద శుభవార్తగా మారనుంది. ముఖ్యంగా ఈస్టర్ టైమ్ లో వెలువడిన ఈ నిర్ణయంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫైజర్ లేదా మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కు చెందిన వ్యాక్సిన్లలో ఏది తీసుకున్నా రెండు వారాలు గడిచిన తర్వాత ఇండోర్ సమావేశాల్లోనూ మాస్క్ లు లేకుండా పాల్గొనవచ్చని చెబుతోంది. వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారు అమెరికా నుంచి వీడేటప్పుడు ముందస్తు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
అదే సమయంలో అమెరికాలోకి వచ్చేటప్పుడు కూడా క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిబంధనలను మాత్రం పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే విదేశాల నుంచి వచ్చేవారు మాత్రం కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారు వ్యాక్సిన్ తీసుకోని వారికైనా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. పలు దేశాలు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పర్యాటక పరంగా కూడా కొద్ది రోజుల క్రితం వ్యాక్సిన్ పాస్ పోర్టు అనే కాన్సెప్ట్ ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా పలు కీలక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవటంతో వీటి ఆధారంగా పర్యాటకాన్ని అనుమతించే ఏర్పాట్లు చేస్తున్నారు.
- Fully Vaccinated Americans Travel Cdc Statement Low Risk Latest travel news రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎక్కడైైనా తిరగొచ్చు సీడీసీ కీలక ప్రకటన Fully Vaccinated Americans Travel Cdc Statement Low Risk Latest travel news రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎక్కడైైనా తిరగొచ్చు సీడీసీ కీలక ప్రకటన