శంషాబాద్ విమానాశ్ర‌యంలో పెరిగిన ర‌న్ వే సామ‌ర్ధ్యం

శంషాబాద్ విమానాశ్ర‌యంలో పెరిగిన ర‌న్ వే సామ‌ర్ధ్యం

ప్ర‌స్తుతం శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో గంట‌కు 36 విమానాల మూమెంట్స్ కు అవ‌కాశం ఉంది. కొత్త‌గా అందుబాటులోకి తెచ్చిన నాలుగు నూతన ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీ వేల‌తో ఇది మ‌రింత పెర‌గ‌నుంది. దీంతో గంట‌కు విమానాల మూమెంట్స్ 36 నుంచి 45కి పెర‌గ‌నున్నాయి. వేగవంతమైన, నిరాటంకమైన విమానాల రాకపోకలకు ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని జీహెచ్ఐఏఎల్ వెల్ల‌డించింది. ఈ ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలతో పాటు, రిహాబిలిటేషన్ పనుల అనంతరం హైదరాబాద్ విమానాశ్రయం ప్రాథమిక రన్‌వేను కూడా విజయవంతంగా ప్రారంభించింది. కొత్త రాపిడ్ ఎగ్జిట్ టాక్సీవేలు విమానాశ్రయ కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ఆర్ఈటీ లు విమానాలు రన్‌వేకు కొద్ది దూరం నుంచే ట్యాక్సీయింగ్ చేసే విధంగా రూపొందించబడ్డాయి. దీనివల్ల రన్‌వే ఆక్యుపెన్సీ సమయం తగ్గి, తద్వారా రన్‌వే సామర్థ్యం పెరుగుతుంది. వీటితో పాటు, రిహాబిలిటేషన్ వల్ల పేవ్‌మెంట్ క్లాసిఫికేషన్ నెంబర్ (PCN), రన్‌వే యొక్క ఫ్రిక్షనల్ విలువలు పెరుగుతాయి, తద్వారా విమానాశ్రయం నుంచి వచ్చీపోయే విమానాల భద్రత పెరుగుతుంది.

వీటితో పాటు జీహెచ్ ఐఏఎల్ త‌న ఎయిర్‌సైడ్ లైటింగ్‌లో 98% (ఎయిర్‌ఫీల్డ్ సైనేజ్, టాక్సీవే సెంటర్‌లైన్ లైట్లు, రన్‌వే లైట్లు) సమర్థవంతమైన ఎల్ ఈడీ లైటింగ్‌లుగా మార్చడం ద్వారా మరో హరిత మైలురాయిని చేరుకుంది. దీని వల్ల విద్యుత్ గణనీయంగా ఆదా అవడమే కాకుండా, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. రన్‌వే మరియు ఇతర ఎయిర్‌ఫీల్డ్ లైటింగ్‌లు ఎయిర్ పోర్టుల సురక్షిత కార్యకలాపాలకు కీలకం. కొత్తగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా ఎయిర్‌ఫీల్డ్స్‌ స్పష్టంగా కనిపించడానికి దోహదపడి, విమానాల సురక్షిత రాకపోకలకు సహకరిస్తాయి. ఈ ఏరోనాటికల్ గ్రౌండ్ లైటింగ్ అప్‌గ్రేడేషన్ రన్‌వే రిహాబిలిటేషన్ పనుల్లో భాగంగా జరిగిందని తెలిపారు.

Similar Posts

Recent Posts

International

Share it