జీఎంఆర్ 'హోయి యాప్'లో అదనపు సౌకర్యాలు
జీఎంఆర్ సంస్థ తమ విమానాశ్రయాల్లో ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు 'హోయి' యాప్ ను తీసుకొచ్చింది. ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా డిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలు గత ఏడాది హోయి (HOI) యాప్ భాగస్వామ్యంతో విమానాశ్రయాలలో కాంటాక్ట్ లెస్ ఫుడ్ ఆర్డరింగ్ సేవలను ప్రారంభించాయి. హోయి డిజిటల్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ - ఆండ్రాయిడ్, IOS కోసం మొబైల్ యాప్ రూపంలో, వెబ్ యాప్ రూపంలో మరియు విమానాశ్రయాలలో డిజిటల్ సెల్ఫ్ ఆర్డర్ కియోస్క్‌గా లభిస్తుంది. ఇది స్మార్ట్ ఎయిర్‌పోర్ట్ ఇంటిగ్రేషన్, కామర్స్ ఫీచర్స్ కలిగిన డిజిటల్ ప్లాట్‌ఫామ్. హోయి యాప్ ద్వారా డ్యూటీ-ఫ్రీ, రిటైల్, ఫుడ్ అండ్ బెవరేజెస్, లాంజ్‌లు, పార్కింగ్, క్యాబ్ వంటి పలు సేవల 80 ప్రముఖ అవుట్‌లెట్‌లు మరియు బ్రాండ్‌లకు చెందిన 10,000కు పైగా ఉత్పత్తులు ఒకే ప్లాట్‌ఫాం కిందకు తీసుకువచ్చారు.
ప్రయాణీకులు తమ ప్రయాణ వివరాలను హోయి యాప్‌తో జోడిస్తే లేదా ప్రయాణ వివరాలను స్కాన్ చేయడం ద్వారా దానిలో అప్ లోడ్ చేస్తే, ప్రయాణంలోని ప్రతి దశలో ప్రయాణీకులకు సహాయపడే విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఆ తరువాత ప్రయాణీకులు వారు ప్రయాణంచబోయే విమాన వివరాలను ట్రాక్ చేయవచ్చు. అంతే కాకుండా గేట్లలో మార్పులు, గమ్యం వద్ద వాతావరణ సూచనల గురించి రియల్ టైమ్ అలర్ట్ లను పొందవచ్చు. విమానాశ్రయానికి/విమానాశ్రయం నుంచి బయటికి ప్రయాణ సదుపాయాలను అన్వేషించి, బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రయాణం రోజున ట్రాఫిక్, చెకిన్‌కు పట్టే సమయం, సెక్యూరిటీకి పట్టే సమయం (అంతర్జాతీయ ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్) మరియు బోర్డింగ్ గేట్‌కు ఎంత దూరం ఉంది వంటి వివిధ అంశాలపై సమాచారం ఆధారంగా ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చని తెలిపారు.
- Gmr Hoi App Hyderabad Delhi AIrports Added More Features Air Travellers Latest travel news జీఎంఆర్ హోయి యాప్ ప్రయాణికులకు మరిన్ని సేవలు సీమ్ లెస్ సేవలు హైదరాబాద్..ఢిల్లీ విమానాశ్రయాల్లో Gmr Hoi App Hyderabad Delhi AIrports Added More Features Air Travellers Latest travel news జీఎంఆర్ హోయి యాప్ ప్రయాణికులకు మరిన్ని సేవలు సీమ్ లెస్ సేవలు హైదరాబాద్..ఢిల్లీ విమానాశ్రయాల్లో