గోవాలో లాక్ డౌన్ పొడిగింపు

గోవాలో లాక్ డౌన్ పొడిగింపు

అగోండా బీచ్, దక్షిణ గోవా 

దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాలో లాక్ డౌన్ ను జూన్ 7 వరకూ పొడిగించారు. తొలి దశతో పోలిస్తే రెండవ దశలో గోవాలో కరోనా కేసులు కలకలం రేపాయి. అంతే కాకుండా పాజిటివిటి రేటు కూడా అత్యధికంగా ఉండటంతో గత కొన్ని రోజులుగా పలు చర్యలు చేపట్టారు. ఈ చర్యలు ఫలితాన్ని ఇస్తుండటంతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గోవాలో పాజిటివిటి రేటు 48 శాతం నుంచి 21 శాతానికి తగ్గింది.

దీన్ని మరింత తగ్గించేందుకే లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. దేశంలో పాజిటివిటి రేటు పది శాతం పైన ఉంటే లాక్ డౌన్ విధించాలని గతంలోనే సూచించింది. గత 24 గంటల్లో గోవాలో కొత్తగా 1055 కేసులు నమోదు అయ్యాయి.

Similar Posts

Recent Posts

International

Share it