శ్రీలంకతో భారత్ ఎయిర్ బబుల్ ఒఫ్పందం
భారత్-శ్రీలంకల మధ్య త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భారత్ తాజాగా శ్రీలంకతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. దీంతో భారత్ మొత్తం 28 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు అయింది. తాజా ఒప్పందంతో ప్రత్యేక అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు శ్రీలంకకు ప్రారంభం కానున్నాయని పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఎంపిక చేసిన పరిమితుల మధ్య ఈ సర్వీసులు నడుస్తాయి. దీంతో అర్హత ఉన్న ప్రయాణికులు రెండు దేశాల మధ్య రాకపోకలు సాగించవచ్చు.
కరోనా కారణంగా గత ఏడాది మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ మార్గాల్లో షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంతో కలుపుకుంటే భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందాలు చేసుకున్న దేశాల జాబితా ఇలా ఉంది. జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, అప్ఘనిస్తాన్, బహ్రెయిన్, ఇరాక్, మాల్దీవులు, నైజీరియా, ఖతార్, యూఏఈ, యూకె, అమెరికా, రష్యా, నేపాల్ దేశాలు ఉన్నాయి. కరోనా సమయంలో వందే భారత్ మిషన్ కింద పలు దేశాల నుంచి ప్రయాణికులను భారత్ కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
- India Srilanka Air Bubble Arrangement Now indians can Fly srilanka List of 28 countries Latest travel news భారత్ శ్రీలంకల మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం త్వరలో విమాన సర్వీసులు India Srilanka Air Bubble Arrangement Now indians can Fly srilanka List of 28 countries Latest travel news భారత్ శ్రీలంకల మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం త్వరలో విమాన సర్వీసులు