అంతర్జాతీయ విమాన సర్వీసుల నిషేధం మే 31 వరకూ
భారత్ మరోసారి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగించింది. మే 31 వరకూ ఈ నిషేధం కొనసాగనుంది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఇప్పటికే ప్రపంచంలోని పలు కీలక దేశాలు భారత్ నుంచి విమాన సర్వీసులను అనుమతించటం లేదు. ఎయిర్ బబుల్ ఒప్పందాలు ఉన్న దేశాలు సైతం తాజాగా భారత్ నుంచి విమానాలను నిషేధించాయి. అయితే గతంలో భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని ఏప్రిల్ 30 వరకూ విధించింది.
ఈ గడువు ముగియటంతో ఇప్పుడు మరోసారి మే 31 వరకూ అంతర్జాతీయ వాణిజ్య విమానా సర్వీసుల నిషేధాన్ని పౌరవిమానయాన శాఖ జాయింట్ డైరక్టర్ జనరల్ సునీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎప్పటిలాగానే ఎంపిక చేసిన రూట్లలో వాణిజ్య విమానాలను డీజీసీఏ అనుమతుల మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కార్గో విమానాలపై ఎలాంటి నిషేధం ఉండదు.
- India Extended ban International commercial passenger flights upto May 31st Civil aviation ministry Latest travel news అంతర్జాతీయ విమానాలు నిషేధం మే 31 వరకూ పొడిగింపు India Extended ban International commercial passenger flights upto May 31st Civil aviation ministry Latest travel news అంతర్జాతీయ విమానాలు నిషేధం మే 31 వరకూ పొడిగింపు