జులై నెలాఖరు వరకూ అంతర్జాతీయ విమానాలపై నిషేధం
భారత్ మరోసారి అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఈ సారి జులై 31 వరకూ ఈ నిషేధం అమల్లో ఉండనుంది. కరోనా తొలి దశ నుంచి ఇలా ప్రతి నెలా అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగించుకుంటూ పోతుంది. మధ్యలో ఒక్కసారి కూడా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కాలేదు. అయితే అంతర్జాతీయ కార్గో విమాన సర్వీసులకు మాత్రం ఎలాంటి నిషేధం ఉండదు. అయితే ఎంపిక చేసిన రూట్లలో డీజీసీఏ అనుమతితో విమాన సర్వీసులను అనుమతించనున్నట్టు ప్రకటించారు.
ఈ విషయంలో ఒక్కో దేశం..ఆయా దేశాల ఎయిర్ లైన్స్ ఆసక్తులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అసలు రెగ్యులర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి. పలు దేశాల్లో కొత్తగా డెల్టా..డెల్టా ప్లస్ కరోనా వేరియంట్లు వెలుగు చూస్తుండటంతో అనిశ్చితి నెలకొంది. వ్యాక్సినేషన్ ఊపందుకుంటుండటంతో వ్యాక్సిన్ పాస్ పోర్టుల ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
- India Extends Ban International commercial passenger flights till july end. Dgca order Latest travel news జులై నెలాఖరు వరకూ అంతర్జాతీయ విమానాలపై నిషేధం India Extends Ban International commercial passenger flights till july end. Dgca order Latest travel news జులై నెలాఖరు వరకూ అంతర్జాతీయ విమానాలపై నిషేధం