దేశంలో ఎన్ని హెలికాప్టర్లు ఉన్నాయో తెలుసా?
గతంతో పోలిస్తే దేశంలో ప్రైవేట్ జెట్ లు..హెలికాప్టర్ల వాడకం పెరిగింది. ఇది చూసే మనం బాబోయ్ అనుకుంటున్నాం. కానీ ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఈ విషయంలో ఇంకా చాలా చాలా వెనకబడి ఉన్నట్లే లెక్క. అది ఎలాగా అంటే అమెరికాలో ఏకంగా 14 వేలకు పైగా హెలికాప్టర్లు ఉంటే...బ్రెజిల్ లో 1250 హెలికాప్టర్లు.ఆస్ట్రేలియాలో రెండు వేల వరకూ హెలికాప్టర్లు ఉన్నాయి.
భారత్ లో మొత్తం కలిపితే ఉన్న హెలికాప్టర్ల సంఖ్య మూడు వందల లోపే. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. పార్లమెంటరీ ప్యానల్ దీనికి సంబంధించి ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను హెలికాప్టర్ సర్వీసుల ద్వారా అనుసంధానం చేయాలని సూచించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ దిశగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
- Helicopters India Less than 300 Hardeep singh puri Civil aviation Minister Latest travel news దేశంలో హెలికాప్టర్లు మూడు వందల లోపే హర్దీప్ సింగ్ పూరీ పార్లమెంటరీ ప్యానల్ Helicopters India Less than 300 Hardeep singh puri Civil aviation Minister Latest travel news దేశంలో హెలికాప్టర్లు మూడు వందల లోపే హర్దీప్ సింగ్ పూరీ పార్లమెంటరీ ప్యానల్