కర్నూలు-బెంగుళూరుకు ఇండిగో విమాన సర్వీసులు
కర్నూలులో కొత్తగా అభివృద్ధి చేసిన ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ పలు సర్వీసులు ప్రారంభించటానికి ముందుకొచ్చింది. కర్నూలు నుంచి బెంగుళూరుతోపాటు విశాఖపట్నం, చెన్నయ్ నగరాలకు కనెక్టివిటి కల్పించనుంది. ఉడాన్ స్కీమ్ లో భాగంగా ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. మార్చి28 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ కు అనుమతి లభించిన నేఫథ్యంలో ఈ ప్రాంతంలో ఎయిర్ కనెక్టివిటి ఎంతో కీలకం కానుందని ఇండిగో భావిస్తోంది. కర్నూలు విమానాశ్రయం నుంచి బెంగుళూరు, చెన్నయ్, విశాఖపట్నం రూట్లలో వారానికి నాలుగు సర్వీసులు ఉంటాయని ఇండిగో వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ కనెక్టివిటి పెంచేందుకు ఇది దోహదపడగలదని భావిస్తున్నారు.
- Kurnoll airport Indigo airlines Services Banglore Visakapatnam Latest travel news కర్నూలు విమానాశ్రయం ఇండిగో ఎయిర్ లైన్స్ బెంగుళూరు విశాఖపట్నం చెన్నయ్ సర్వీసులు Kurnoll airport Indigo airlines Services Banglore Visakapatnam Latest travel news కర్నూలు విమానాశ్రయం ఇండిగో ఎయిర్ లైన్స్ బెంగుళూరు విశాఖపట్నం చెన్నయ్ సర్వీసులు