తక్కువ లగేజీతో ప్రయాణిస్తే విమాన టిక్కెట్లలో రాయితీ

తక్కువ లగేజీతో ప్రయాణిస్తే విమాన టిక్కెట్లలో రాయితీ

తక్కువ లగేజీ. తక్కువ రేటుకే విమాన టిక్కెట్. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు విమానయాన నియంత్రణా సంస్థ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలు జారీ చేసింది. దేశీయ రూట్లలో కేవలం కేబిన్ బ్యాగేజ్ తో వెళ్ళేవారికి టికెట్ ధరల్లో రాయితీ కల్పించనున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. చెక్ఇన్ బ్యాగేజ్ ఉన్న వారికి మాత్రం ఎలాంటి రాయితీలు ఉండవు. అయితే టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు తమ లగేజ్ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం... విమాన ప్రయాణికులు ఏడు కిలోల వరకు క్యాబిన్‌ బ్యాగేజ్‌, 15 కిలోల వరకు చెక్‌ఇన్‌ లగేజ్‌లను తీసుకెళ్లవచ్చు.

అంతకంటే ఎక్కువ లగేజ్‌ తీసుకెళితే... అదనపు ఛార్జీలు విధిస్తున్నారు. కొత్తగా అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం... ఇకపై చెక్‌ఇన్‌ బ్యాగ్‌లు లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించే వారికి విమానయాన సంస్థలు టికెట్ల ధరలో రాయితీలు ఇస్తాయి. ''ఎయిర్‌లైన్‌ బ్యాగేజీ పాలసీ మేరకు... విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఉచిత బ్యాగేజ్‌ అలవెన్సెస్‌తో పాటు జీరో బ్యాగేజ్‌/నో చెక్‌ఇన్‌ బ్యాగేజ్‌ ధరల స్కీంను అందించేలా అనుమతినిస్తున్నాం. ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ఈ టికెట్‌ ధరల స్కీం గురించి వారికి తెలియజేయాలి. ఇక ఈ వివరాలను టికెట్‌పై తప్పనిసరిగా ప్రింట్‌ చేయాలి' అని డీజీసీఏ పేర్కొంది.

Similar Posts

Recent Posts

International

Share it