మాల్దీవుల 'త్రీ వీ' ప్లాన్ రెడీ

మాల్దీవుల త్రీ వీ ప్లాన్ రెడీ

కరోనా సంక్షోభ సమయంలోనూ పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకున్న ప్రాంతాల్లో మాల్దీవులు ఒకటి. ముఖ్యంగా భారత్ నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు ఆ దేశంలో పర్యటించారు. ఈ ఏడాది మాల్దీవులు 15 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇఫ్పటికే 3.5 లక్షల మంది మాల్దీవులను సందర్శించారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులే. మాల్దీవులు కొత్తగా పర్యాటకుల సంఖ్యను లక్ష్యానికి అనుగుణంగా పెంచుకునేందుకు త్రీ వీ కార్యక్రమం తలపెట్టింది. త్రీ వీ అంటే..విజిట్..వ్యాక్సినేషన్, వెకేషన్ అని మాల్దీవుల పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా మౌసం వెల్లడించారు.

మాల్దీవులకు వచ్చే పర్యాటకులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం చేపట్టాలని ఆ దేశం నిర్ణయించింది. ఇఫ్పటికే అక్కడ పర్యాటక రంగంలో పనిచేసే 90 శాతం మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా నియంత్రణలోనూ మాల్దీవులు తన సత్తా చాటింది. అయితే తమ దేశానికి వచ్చే పర్యాటకులకు ఎప్పటి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తామనే విషయాన్ని ఇంకా వెల్లడించాల్సి ఉంది. సురక్షితమైన పర్యాటక వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాల్దీవుల జనాభాలో ఇప్పటికే 51 శాతం మందికిపైగా తొలి వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it