పేపర్ లెస్ పద్దతిలో పాస్ పోర్టు దరఖాస్తు కు ఛాన్స్
పాస్ పోర్టు దరఖాస్తు విధానంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్నీ వెంటపెట్టుకుని పాస్ పోర్టు ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవటంతో పాస్ పోర్టు జారీకి అవసరమైన డాక్యుమెంట్లను 'డిజిలాకర్'లో అప్ లోడ్ చేసి..ఆ వివరాలు పాస్ పోర్టు కార్యాలయ అధికారులకు అప్పగిస్తే సరిపోతుంది. పేపర్ లెస్ పద్దతి ద్వారా ఈ డిజిలాకర్ తో అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సంబంధిత అధికారులకు అందించవచ్చు. దీంతో దరఖాస్తుదారులు తమ వెంట డాక్యుమెంట్లను తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉండదు. తాజాగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాలు వెల్లడించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ఈ డిజిలాకర్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఈ విధానం ద్వారా ప్రజలకు షేర్ చేసుకునే అవకాశం ఉండే ప్రైవేట్ స్పేస్ ను అందించనుంది. సంబంధిత శాఖ అధికారులు మాత్రమే వీటిని చూసే అవకాశం ఉంటుంది. డిజిలాకర్ లో అన్ని వివరాలు అప్ లోడ్ చేయటం వల్ల ఎప్పుడైనా పాస్ పోర్టు పొగొట్టుకున్నా ఈ వివరాలు పొందటం సులభంగా ఉంటుందని..ప్రపంచంలో ఎక్కడ నుంచైనా వీటిని యాక్సెస్ చేయవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతే కాదు..విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలోనే ఈ పాస్ పోర్టు ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని వల్ల భద్రత పెరగటంతోపాటు విదేశీ విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ కార్యక్రమం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పాస్ పోర్టు సేవల వ్యవహారంలో కొత్త టెక్నాలజీలు అయిన కృత్రిమమేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, చాట్ -బోట్, అనలిటిక్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్ పీఏ) వంటి సాంకేతికతను కూడా ఉపయోగించబోతున్నారు.
- Paperless Passports Digilocker New Intiative Mea Launched E passports shortly latest travel news పాస్ పోర్టుకు దరఖాస్తు పేపర్ లెస్ పద్దతి డిజిలాకర్ డాక్యుమెంట్స్ త్వరలో ఈ పాస్ పోర్టు Paperless Passports Digilocker New Intiative Mea Launched E passports shortly latest travel news పాస్ పోర్టుకు దరఖాస్తు పేపర్ లెస్ పద్దతి డిజిలాకర్ డాక్యుమెంట్స్ త్వరలో ఈ పాస్ పోర్టు