దాల్ సరస్సు..గడ్డ కట్టింది
భూతల స్వర్గమైన కాశ్మీర్ లోని దాల్ లేక్ గడ్డ కట్టింది. అత్యల్ప ఉష్ట్రోగ్రతలు నమోదు కావటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గురువారం రాత్రి శ్రీనగర్ లో గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూలేని రీతిలో మైనస్ 8.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. 1991 తర్వాత ఎప్పుడూ ఈ పరిస్థితి చూడలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. 1991లో అయితే ఏకంగా మైనస్ 11.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది.
పర్యాటకులు ఈ గడ్డకట్టిన దాల్ లేక్ లో నడుస్తూ ఎంజాయ్ చేశారు కొద్దిసేపు. ఈ ఫోటోలను ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. గత కొంత కాలంగా పెద్ద ఎత్తున పర్యాటకులు కాశ్మీర్ వైపు క్యూకట్టారు. కోవిడ్ భయం కాస్త తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులు క్యూకట్టారు. పర్యాటకులు ఎంతో ఇష్టపడే గుల్ మార్గ్ లో కూడా మైనస్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఈ చలికి శ్రీనగర్ విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది.