భారతీయులకు థాయిలాండ్ గుడ్ న్యూస్

భారతీయులకు థాయిలాండ్ గుడ్ న్యూస్

టూరిస్ట్ లను ఆకర్షించటానికి దేశాలు పోటీ పడుతున్నాయి. అక్టోబర్ నెలలలోనే రెండు దేశాలు ఈ మేరకు కీలక ప్రకటనలు చేశాయి. భారతీయ పర్యాటకులకు ఇప్పుడు థాయిలాండ్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అది ఏంటి అంటే భారతీయులు ఇప్పుడు వీసా లేకుండానే పర్యాటకంగా ప్రపంచంలో కీలకమైన దేశంగా ఉన్న థాయిలాండ్ వెళ్లొచ్చు. నవంబర్ 10 నుంచి 2024 మే 10 వరకు వీసా లేకుండా భారతీయులు ఆ దేశంలో 30 రోజులు ఉండొచ్చు. ఈ మేరకు థాయిలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సౌకర్యం ఇండియా తో పాటు తైవాన్ కు కూడా కల్పించారు. భారత్ నుంచి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు థాయిలాండ్ వెళతారు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే చైనా పౌరులకు థాయిలాండ్ వీసా లేకుండా పర్యటించే వెసులు బాటు కల్పించింది.

గత నెలలోనే వాళ్లకు ఈ సౌకర్యం కల్పించారు. థాయిలాండ్ కు పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ పర్యాటక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు భారత్ నుంచి థాయిలాండ్ కు రెండు కోట్ల ఇరవై లక్షల మంది పర్యాటకులు వెళ్లారు. కొద్ది రోజుల క్రితమే శ్రీలంక కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ తో పాటు పలు దేశాలకు చెందిన వారు ఎలాంటి వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించవచ్చు అని శ్రీలంక ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు శ్రీలంక అయినా...ఇప్పుడు థాయిలాండ్ అయినా తమ తమ దేశాలకు పెద్ద సంఖ్యలో టూరిస్ట్ లను ఆకట్టుకునేందుకు వరుసగా వీసా లు అవసరం లేకుండా చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఈ దేశాల బాట పట్టే అవకాశం ఉంది చెపుతున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it