జులై1 నుంచి పర్యాటకులకు థాయ్ లాండ్ అనుమతి
ప్రముఖ పర్యాటక దేశం థాయ్ లాండ్ జులై1 నుంచి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను అనుమతించాలని యోచిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. జులై1 తేదీని ఎంచుకోవటం వెనక బలమైన కారణాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. జులై నాటికి చాలా మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని..దీంతోపాటు..దేశంలోని హోటల్స్, ఎయిర్ లైన్స్, పర్యాటకులు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవటానికి..అంతా రెడీ చేసుకోవటానికి ఈ సమయం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు థాయ్ లాండ్ అధికారులు పేర్కొన్నారు.
ఆ దేశంలోని పర్యాటక అనుబంధ సంస్థలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్వారంటైన్ నిబంధనలను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 'ఓపెన్ థాయ్ లాండ్ సేఫ్ లీ' నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే థాయ్ ల్యాండ్ కరోనా నియంత్రణలో విజయవంతం అయింది. ఆ దేశంలో కేవలం 84 మరణాలు మాత్రమే చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జులై నుంచి పర్యాటక రంగాన్ని ఓపెన్ చేస్తే వచ్చే ఏడాది నాటికి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.
- Thailand Tourists May Allow July 1st onwards vaccine Passport Considering Latest travel news థాయ్ ల్యాండ్ జులై 1 నుంచి పర్యాటకులను అనుమతి ఏర్పాట్లలో బిజీ OpenThailandSafely Thailand Tourists May Allow July 1st onwards vaccine Passport Considering Latest travel news థాయ్ ల్యాండ్ జులై 1 నుంచి పర్యాటకులను అనుమతి ఏర్పాట్లలో బిజీ #OpenThailandSafely