చార్ దామ్ యాత్ర రద్దు
ఎట్టకేలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ దామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల వరకూ ప్రభుత్వం యాత్ర విషయంలో ముందుకెళ్ళాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ముందుకు సాగింది. దేశంలో కరోనా రెండవ దశ విలయం సృష్టిస్తుండటంతో చార్ ధామ్ యాత్రను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం అయితే మే 14 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.
ఇప్పటికే కుంభమేళా కారణంగా దేశంలో కరోనా కేసులు భారీ ఎత్తున పెరిగాయనే విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చార్ దామ్ లో కేవలం పూజారులు మాత్రమే తమ కార్యక్రమాలు కొనసాగిస్తారు. యాత్రికులను, భక్తులను దీనికి అనుమతించరాదని నిర్ణయించారు.
- Char Dham Yatra Suspended Uttarakhand government Chief Minister Tirath Singh Rawat In view of COVID19 situation Latest travel news చార్ దామ్ యాత్ర రద్దు కరోనా కేసుల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సీఎం తీర్థ్ సింగ్ రావత్ Char Dham Yatra Suspended Uttarakhand government Chief Minister Tirath Singh Rawat In view of #COVID19 situation Latest travel news చార్ దామ్ యాత్ర రద్దు కరోనా కేసుల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సీఎం తీర్థ్ సింగ్ రావత్