ప్ర‌పంచ ప‌ర్యాట‌కం కోలుకునేది అప్పుడే!

ప్ర‌పంచ ప‌ర్యాట‌కం కోలుకునేది అప్పుడే!

చాలా వ‌ర‌కూ ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా సాధార‌ణ ప‌రిస్థితులే నెల‌కొన్నాయి. కొన్ని దేశాల్లో మాత్రం క‌రోనా కేసులు భారీగానే ఉన్నాయి. అయితే ప్ర‌పంచ ప‌ర్యాట‌క రంగం తిరిగి కోవిడ్ ముందు నాటి స్థితికి 2025 వ‌ర‌కూ ప‌డుతుంద‌ని తాజాగా ఓ నివేదిక వెల్ల‌డించింది. 2022 సంవ‌త్సంలో అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కులు కోవిడ్ కంటే ముందు ఉన్న దాంట్లో 68 శాతానికి చేరుకునే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశారు. ఇది 2023లో 82 శాతానినికి, 2024 నాటికి 97 శాతానికి చేరుకుంటుంద‌ని లెక్క‌లేశారు. 2025 సంవ‌త్స‌రానికి సాధార‌ణ స్థితికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఆ స‌మ‌యంలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల సంఖ్య 1.5 బిలియ‌న్ల‌కు చేర‌వచ్చ‌ని ఓ అంచ‌నా. రెండేళ్ళ పాటు క‌రోనా లాక్ డౌన్ల‌తో పూర్తిగా ఇళ్ళ‌కే ప‌రిమితం అయిన ప‌ర్యాట‌క ప్రియులు ఇప్పుడిప్పుడే లీజ‌ర్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారు

. అయితే అక‌స్మాత్తుగా తెర‌పైకి వ‌చ్చిన ప్రపంచ వ్యాప్తంగా ద్ర‌వ్రోల్బ‌ణ స‌మ‌స్య‌లు, ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్దం కూడా ఈ రంగంపై ప్ర‌భావం చూపిస్తున్నాయ‌ని గుర్తించారు. భౌగౌళికంగా చూస్తే యుద్ధం ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల‌ను దాట‌క‌పోయినా..ర‌ష్యా ప్ర‌పంచంలోనే ఐద‌వ అతి పెద్ద ట్రావెల్ మార్కెట్ గా ఉండే..ఉక్రెయిన్ స్థానం 12లో ఉంది. అయితే ర‌వాణా రంగం..ప‌ర్యాట‌క రంగంల మ‌ధ్య చిన్న వ్య‌త్యాసం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వ్య‌క్తిగ‌తంగా ట్రావెల్ ప్యాకేజీల‌ను కోరుకుంటున్న‌ట్లు ఏజెన్సీలు చెబుతున్నాయి. 2025 సంవ‌త్స‌రం నాటికి పూర్తి రిక‌వ‌రి అంటే ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంద‌ని..అయితే ఆశే ఈ రంగాన్ని న‌డిపిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it