లుంబినీ పార్క్‌

లుంబినీ పార్క్‌

ఓ వైపు ట్యాంక్ బండ్. మరో వైపు నెక్లెస్ రోడ్డు. కొద్దిగా ముందుకెళితే ఎన్టీఆర్ గార్డెన్స్. రాష్ట్ర పరిపాలనా కేంద్రం అయిన సచివాలయం ఎదురుగా ఉంటుంది లుంబినీ పార్క్. నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఈ పార్కు ఒకటి. ఏటా ఈ పార్కుకు లక్షలాది మంది సందర్శకులు వస్తుంటారు. లుంబినీ పార్కులో లేజర్ షో,వాటర్ ఫౌంటెన్లు ప్రత్యేక ఆకర్షణ. మల్టీమీడియా ఫౌంటెన్ షో చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు.

ఈ ప్రదర్శనలో అబ్బురపరిచే లేజర్ యానిమేషన్, లైవ్ వీడియో, అద్భుతమైన శబ్ద నాణ్యత, రిథమిక్ మ్యూజికల్ ఫౌంటెన్, అసాధారణ బీం ఎఫెక్టులు అన్నీ కలిసి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.ఇండియాలోని అతిపెద్ద నీటితెరగా (వాటర్ స్క్రీన్) దీనిని వర్ణిస్తారు. లుంబినీ పార్కు నుంచే పర్యాటకులు హుస్సేన్ సాగర్‌లో బోటింగ్ చేయవచ్చు. స్పీడ్ బోట్ సౌకర్యంతో పాటు...పార్టీలు చేసుకునేందుకు అనువైన భారీ బోట్లు కూడా ఇక్కడ ఉంటాయి. లుంబినీ పార్క్ మొత్తం 7.5ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.

సందర్శన సమయం: ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8..45 గంటల వరకూ

Similar Posts

Recent Posts

International

Share it