ముంబయ్ విమానాశ్రయం మూసివేత

ముంబయ్ విమానాశ్రయం మూసివేత

దేశంలోని అత్యంత రద్దీగా ఉండే ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసేశారు. ఇటీవలే లాక్ డౌన్ మినహాయింపులతో సర్వీసులు ప్రారంభించిన విమానాశ్రయ కార్యకలాపాలపై ‘విసర్గ తుఫాన్’ ఎఫెక్ట్ పడింది. తుఫాన్ కారణంగా ముంబయ్ అతలాకుతలం అవుతోంది. ఏకంగా ముంబయ్ విమానాశ్రయం రన్ వేపైకి నీరు వచ్చి చేరింది. దీంతో సాయంత్రం ఏడు గంటల పాటు విమానాశ్రయాన్ని మూసివేయాలని ఆదేశించారు. ఇప్పటికే పలు ఎయిర్ లైన్స్ తమ సర్వీసులను పెద్ద ఎత్తున కుదించాయి.

ఇప్పుడు తాజాగా విమానాశ్రయం మూసివేతకు ఆదేశించారు. ఇఫ్పటివరకూ పరిమిత సంఖ్యలోనే విమాన సర్వీసులను నడిపారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే విమానాశ్రయం మూసివేత మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. విపరీతమైన వేగంతో వీస్తున్న గాలుల వల్ల ప్రమాదానికి ఛాన్స్ ఉండటంతో విమానాశ్రయంలో కార్యకలాపాలు ఆపేశారు. విసర్గ తుఫాన్ తీరం దాటడంతో ముంబయ్ కు పెను ముప్పు తప్పినట్లు అయింది. బుధవారం సాయంత్రం తిరిగి విమాన సర్వీసులను ప్రారంభించారు.

Similar Posts

Recent Posts

International

Share it