విమానం ఎక్కాలంటే రెండు గంటలు ముందు వెళ్లాల్సిందే

విమానం ఎక్కాలంటే రెండు గంటలు ముందు వెళ్లాల్సిందే

దేశీయ విమానయానం పూర్తిగా మారబోతోంది. ఇక నుంచి విమానం ఎక్కాలంటే రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాల్సిందే. అంతే కాదు జేబులో శానిటైజర్, చేతికి గ్లోవ్స్..ముఖానికి మాస్క్ తప్పనిసరి. త్వరలోనే దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం అవుతుండటంతో విమాన ప్రయాణికులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. గతంలో అంతర్జాతీయ ప్రయాణికులు మాత్రమే విమానాశ్రయాలకు రెండు గంటల ముందు చేరుకోవాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు అది దేశీయ విమాన ప్రయాణికులకు కూడా వర్తించనుంది. దేశీయ ప్రయాణికులు కూడా తమ విమాన సమయానికి రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రయాణికుడు ఇంట్లోనే వెబ్ చెక్ ఇన్ పూర్తి చేసుకుని విమానాశ్రయానికి రావాల్సి ఉంటుంది. ఎయిర్ లైన్స్ కూడా విమానం బయలుదేరటానికి మూడు గంటల ముందే చెక్ ఇన్ కౌంటర్లను ఓపెన్ చేసి ..విమానం బయలుదేరటానికి 60 నుంచి 75 నిమిషాల ముందు కౌంటర్లను క్లోజ్ చేయాల్సి ఉంటుంది.

బోర్డింగ్ గంట ముందు ప్రారంభించి ప్రయాణానికి 20 నిమిషాల ముందు గేట్లు క్లోజ్ చేస్తారు. తొలి దశలో 80 సంవత్సరాల పైబడిన ప్రయాణికులను విమానాల్లోకి అనుమతించరు. అంతే కాదు. ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించేటప్పుడు ఒకసారి...విమానంలోకి ప్రవేశించే సమయంలో మరోసారి టెంపరేజర్ చెక్ చేయనున్నారు. విమాన ప్రయాణానికి ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి చేశారు. దేశీయ విమానాల్లో ప్రయాణికులకు ఎలాంటి ఆహారం అందజేయరు. మంచి నీరు మాత్రం కప్పులు, బాటిళ్లు గ్యాలరీల్లో ఉంచుతారు

Similar Posts

Recent Posts

International

Share it