పిల్లలమర్రి
పిల్లలమర్రి. ఈ ప్రాంతానికి పెద్ద చరిత్ర ఉంది. ఇది మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పెద్దమర్రిచెట్టు. దూర ప్రాంతాలనుంచి ఈ మహావృక్షాన్ని చూడడానికియాత్రికులు తరలివస్తుంటారు. ముఖ్యంగా డిసెంబరు, జనవరి మాసాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మహా వృక్షాన్ని సందర్శిస్తారు. సుమారు 800సంవత్సరాలనాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడ వది. దూరం నుంచి చూస్తే ఈ చెట్టు దట్టమైన చెట్లతో నిండిఉన్న చిన్న కొండలాగా ఉంటుంది. దగ్గరికి వెళ్లి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా కనిపిస్తుంది. మర్రిచెట్టు పక్కనే మ్యూజియం,జింకలపార్కు ఉన్నాయి. ఇక్కడొక మహా మర్రివృక్షం కనిపిస్తుంది. కనీసం800 సంవత్సరాల గతానుభవాల్ని మౌనంగా వీక్షించిన ఈ ఘన వృక్షం పిల్లలమర్రికి ప్రత్యేకతను సాధించి పెట్టింది.
చెట్లు సైతం రాళ్లవలే కలకాలం బతుకుతాయి సుమా! అనుకునేట్టుగా పుట్టి పెరిగి ఎదిగిపోయిన పిల్లలమర్రిని చూడడం నిజంగానే అద్భుత అనుభవం. ఈ మహావృక్షం మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. మర్రికి పిల్లలు అంకురించడంతో ఇది ‘పిల్లల మర్రి’గా మారింది. వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలిచి ఇది మహావృక్షమైంది. ఈ చెట్టు ప్రధాన కాండం ఎక్కడుందో చెప్పడం కష్టం. దీని పుట్టుకకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు. ఇక్కడొక జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, అక్వేరియం ఉన్నాయి. వర్షాకాలంలో అయితే చక్కగా బోటు షికారూ చేయవచ్చు. అందుకు అవసరమైన సౌకర్యాలున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన కమనీయ శిల్పాలను పురావస్తుశాఖ మ్యూజియంలో ఉంచారు. విహారయాత్రకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్కు ఉంది. రకరకాల పక్షులు, నెమళ్లు, కుందేళ్లు, కోతులు ఉంటాయి.
సందర్శించు వేళలు: ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 6.00గంటల వరకూ
హైదరాబాద్ నుంచి 104 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.