పొచ్చర్ల జలపాతం

పొచ్చర్ల జలపాతం

ఆదిలాబాద్ జిల్లా జలపాతాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది. ఓవైపు కుంటాల జలపాతం..మరోవైపు పొచ్చర్ల జలపాతం రెండూ ఇక్కడే ఉండటంతో పర్యాటకులు ఈ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పొచ్చర్ల జలపాతం చిన్నదే అయినా ఆకర్షణీయంగా ఉంటుంది. పొచ్చెర్ల గ్రామ సమీపంలోని చిన్న కొండ వాగు రాళ్లపై నుంచి దూకే ఈ దృశ్యం ఆహ్లాదకరంగా ఉంటుంది. చూపరులను ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది. గోదావరి నది దట్టమైన అడవుల గుండా సర్పాకృతితో నిర్మలంగా ప్రవహిస్తూ క్రమేణా పొచ్చెర్ల జలపాతంగా మారుతుంది. 20అడుగుల రాళ్ళపై నుంచి వేగంగా ప్రవహించే ఈ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఈ జలపాతం పక్షుల కువకువలతో ఒక మధురమైన అనుభూతికి గురవుతారు. పర్యాటక, అటవీ శాఖలు ఈ ప్రాంతంలో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు కల్పిస్తున్నాయి.

ఆదిలాబాద్‌లో బస చేసి ఈ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది.

ఆదిలాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it