స్పాంజ్ ఎయిర్ పోర్టు రెడీ..నిర్మాణ వ్యయం 45 వేల కోట్లు

స్పాంజ్ ఎయిర్ పోర్టు రెడీ..నిర్మాణ వ్యయం 45 వేల కోట్లు

ఆ నగరంలో ఎటుచూసినా ఆకాశాన్ని తాకే భవనాలు. పార్కులు. బీచ్ లు. ఇప్పుడు ఆ అందాలకు తోడు ‘స్టార్ ఫిష్’ ఆకారంలో ఓ అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ అయింది. ఇందులో కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆర్కిటెక్చర్ అద్భుతంగా చెప్పబడే ఈ క్వింగ్డో జోడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం తో ఆ ప్రాంతంలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కగలదని సర్కారు భావిస్తోంది. చైనా స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ స్టార్ ఫిష్ ఆకారంలో ఉన్న ఈ విమానాశ్రయం నిర్మాణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. అయితే కరోనా కారణంగా ఇంకా విమానాశ్రయం ప్రారంభ తేదీలను ఖరారు చేయలేదు. ఈ విమానాశ్రయాన్ని ఐదేళ్లలో పూర్తి చేశారు. దీనికి అయిన వ్యయం ఎంతో తెలుసా?. భారతీయ కరెన్సీలో దాదాపు 45 వేల కోట్ల రూపాయలు. ఈ క్వాంగ్డో విమానాశ్రయాన్ని 7665 ఎకరాల్లో (3066 హెక్టార్ల) నిర్మించారు.

ఇది లండన్ లో హీత్రో విమానాశ్రయం కంటే పరిమాణంలో రెట్టింపు ఉంటుంది. హీత్రో విమానాశ్రయం 3067 ఎకరాల్లో మాత్రమే ఉంటుంది. అంతే కాదు ఈ నగరంలో ఇది తొలి 4 ఎఫ్ క్లాస్ విమానాశ్రయం. అంటే ఇందులో ప్రపంచంలోని అతి పెద్ద విమానం అయిన ఏ380 డబుల్ డెక్కర్ తోపాటు వైడ్ బాడీతో కూడిన బోయింగ్ 787లు కూడా ఎంతో ఈజీగా ఇక్కడ ల్యాండ్ అవుతాయి. ఈ విమానాశ్రయానికి ‘స్పాంజ్ ఎయిర్ పోర్టు’ అనే పేరు కూడా ఉంది. దీనికి కారణం ఏమిటంటే వర్షం ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసి రీసైక్లింగ్ ద్వారా తిరిగి వాడుకునేలా విమానాశ్రయాన్ని డిజైన్ చేశారు. గత ఏడాది బీజింగ్ లో డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

Similar Posts

Recent Posts

International

Share it