రైల్వే శాఖ కీలక నిర్ణయం
లాక్ డౌన్ ముందు బుక్ చేసిన రైల్వే టిక్కెట్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే జూన్ 30 వరకూ బుక్ అయిన అన్ని రిజర్వేషన్ టిక్కెట్లను రద్దు చేశారు. అయితే ప్రయాణికులకు మాత్రం ఈ టిక్కెట్ల ఛార్జీలను పూర్తిగా రిఫండ్ చేయనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ గురువారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో రాబోయే రోజుల్లోనూ ప్రత్యేక రైళ్లు, శ్రామిక్ రైళ్ళు కొనసాగుతాయని తెలిపారు. దశల వారీగా రైల్వే సర్వీసుల కొనసాగిస్తామని తాజాగా మంత్రి పియూష్ గోయల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే
అందుకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పలు కొత్త సర్వీసులు కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సమాచారం. పూర్తి స్థాయి సర్వీసులకు మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు రైల్వే శాఖ లాక్ డౌన్ కు ముందు చేసిన రిజర్వేషన్లు అన్నింటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మూడవ దశ లాక్ డౌన్ మే 17తో ముగియనుండటంతో త్వరలోనే మరింత సడలింపులతో నాలగ దశకు శ్రీకారం చుట్టనున్నారు. అందులో మరిన్ని రైల్వే సర్వీసులతోపాటు విమాన సర్వీసులను కూడా పరిమితంగా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.