‘ప్రతీకార పర్యాటకం’ కొత్తగా ఉందా...!

‘ప్రతీకార పర్యాటకం’ కొత్తగా ఉందా...!

ప్రపంచం అంతా గత ఏడెనిమిది నెలలుగా ఎక్కడికి అక్కడే ఆగిపోయింది. ప్రజలు అందరూ ఒక్క మాటలో చెప్పాలంటే బందీలుగా మారిపోయారని చెప్పొచ్చు. స్వేచ్చగా తిరిగే పరిస్థితులు లేకుండా పోయాయి. కరోనా అందరినీ అలా చేసింది. ఈ తరుణంలో కరోనా వైరస్ కు కారణమైన చైనా ఓ వెరైటీ స్లోగన్ తో ముందుకొచ్చింది. అదేంటి అంటే ప్రతీకార పర్యాటకం (రివెంజ్ టూరిజం). మన భాషలో చెప్పాలంటే కసితీరా తిరగటం వంటిది. లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు మిలియన్ల కొద్దీ చైనా ప్రజలు దేశమంతటా పర్యటించటానికి రెడీ అయ్యారు. ఎనిమిది రోజుల పబ్లిక్ హాలిడే సందర్భంగా 550 మిలియన్ల మంది పర్యటనలు చేస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి ‘గోల్డెన్ వీక్’ అనే పేరు పెట్టారు కూడా. చైనా ప్రజలు పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఒకేసారి పెద్ద ఎత్తున ప్రజలు పర్యాటక ప్రాంతాల సందర్శన ప్రారంభించటంతో అన్ని చోట్ల ఊహించని స్థాయిలో రద్దీ పెరిగిపోయింది.

అంతే కాదు హోటళ్ళలో బుకింగ్స్ తోపాటు పలు పర్యాటక ప్రాంతాల్లో టిక్కెట్లు కూడా అందుబాటులో లేవని ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఎయిర్ లైన్స్ డిమాండ్ ను తట్టుకునేందుకు పలు సర్వీసులు ప్రారంభించగా, పర్యాటకులకు పలు చోట్ల ఉచిత ప్రవేశాలను కూడా అనుమతించారు. డిమాండ్ ను పెంచేందుకే ఈ చర్యలు ప్రారంభించారు. ఈ వారం రోజుల్లో ప్రజలు చేసే వ్యయం చైనా ఆర్ధిక వ్యవస్థ రికవరికి ఓ సంకేతంలా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా దేశంలో కరోనా కేసులు ఏ మాత్రం లేకపోవటంతో ప్రజలు స్వేచ్చగా బయట తిరుగుతున్నారు. ఈ మోడల్ ఏదో బాగుంది కదా?. కరోనా తగ్గాక దేశంలోని రాష్ట్రాలు కూడా ఈ మోడల్ ను ఫాలో అవ్వొచ్చేమో.

Similar Posts

Recent Posts

International

Share it